మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్‌లో సివిక్ టెండర్ పనులను వెంటనే ప్రారంభించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మనందం డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియాలోని సివిల్ కార్యాలయంలో డీవైజీఎం షేక్ మదీనా పాషాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం బ్రహ్మనందం మాట్లాడుతూ బీజోన్ ఏరియాలో సివిల్ టెండర్ కాలపరిమితి ముగియడంతో టెండర్ వర్కర్స్‌తో పనులు చేయిస్తున్నారని తెలిపారు. వెంటనే యాజమాన్యం చొరవ తీసుకొని డీజీఎం సివిల్ టెండర్‌ను ప్రారంభించి పనులు చేయించేలా చూడాలని కోరారు. అలాగే మందమర్రి ఏరియాలోని సులభ్ కాంప్లెక్స్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. మల్లేశ్, శేఖర్, శ్రీనివాస్, నరేశ్, సంపత్, అప్పారావు, తదితరులు ఉన్నారు.


