ఉట్నూర్‌రూరల్: ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణిలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజ ల నుంచి వినతులు స్వీకరించారు. బోర్‌వెల్ మంజూరు చేయాలని గుడిహత్నూర్ మండలం తోయగూడకు చెందిన పెందోర్ వినాయక్, వాచ్‌మెన్ ఉద్యోగం ఇప్పించాలని మంచిర్యాల మండలం పెద్ద గోపాలపూర్‌కు చెందిన హన్మంతు, ఆర్థికసాయం అందించాలని కెరమెరికి చెందిన భూదేవి దరఖాస్తు అందజేశారు.


