మందమర్రిరూరల్: సింగరేణి యాజమాన్యానికి 31 డిమాండ్లతో కూడిన నోటీస్ ఇచ్చామని, సమస్యలు పరిష్కరించని పక్షంలో కార్మికవర్గం సమ్మెకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న ఆర్‌ఎల్‌సీ వద్ద జరుగనున్న చర్చలు విఫలమైతే సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. యూనియన్ బ్రాంచ్ సెక్రెటరీ సత్యనారాయణ, నాయకులు అక్బర్‌అలీ, సుదర్శన్, కుమారస్వామి, రాజేశ్వర్‌రా వు, తిరుపతి, బానయ్య, రాజేశ్‌కుమార్, కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.


