18 రకాల సేవలు.. | - | Sakshi
Sakshi News home page

18 రకాల సేవలు..

Aug 18 2026 12:15 AM | Updated on Aug 18 2026 12:15 AM

వివిధ సేవలకు వేర్వేరు నంబర్లు.. గతంలో పోలీస్‌ కోసం 100, ఫైర్‌ కోసం 101, అంబులెన్స్‌ కోసం 108, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, మహిళల భద్రతకు 181 వంటి 18 రకాల సేవలు వేర్వేరు నంబర్లపై అందుబాటులో ఉండేవి. ఈ నంబర్లు గుర్తు పెట్టుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు అన్నీ ఒకే నంబర్‌ 112 ద్వారా అందుతాయి. ఏ అవసరం వచ్చినా 112ను గుర్తుంచుకోవాలని పోలీస్‌ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీపీఎస్‌ ద్వారా ట్రాకింగ్‌.. గతంలో అత్యవసర సమయాల్లో చాలామందికి 100, 108 నంబర్లు మాత్రమే గుర్తుండేవి. గొడవలు, ప్రమాదాల్లో పోలీస్‌ సహాయం కోసం 100, ఆసుపత్రి సేవల కోసం 108 వాడేవారు. మిగతా సేవలకు ఎవరికి ఫోన్‌ చేయాలో తెలియక అయోమయంలో పడేవారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఒకే నంబర్‌ 112ను ప్రవేశపెట్టింది. 112కు డయల్‌ చేస్తే జీపీఎస్‌ ద్వారా లొకేషన్‌ ట్రాక్‌ చేసి నేరుగా అత్యవసర సేవలు అందిస్తారు. ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎమర్జెన్సీ’ భావనతో రూపొందించిన ఈ ఏకీకృత సేవను ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు, వేధింపులు వంటి ప్రమాదకర సమయాల్లో 112కు కాల్‌ చేస్తే తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా అత్యాధునిక కాల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌తో అనుసంధానం అవుతుంది. లొకేషన్‌ ఆధారంగా సమీప అత్యవసర బృందాలకు సమాచారం అందుతుంది. సేవలు తక్షణం అందుబాటులోకి వచ్చి సమయం ఆదా అవుతోంది. పోలీస్‌: శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర పోలీస్‌ సహాయం. వైద్య సహాయం : అంబులెన్స్‌, ప్రాణాపాయ సమయంలో అత్యవసర వైద్య సేవలు. అగ్నిమాపక సేవలు : అగ్ని ప్రమాదాల్లో ఫైర్‌ ఇంజిన్‌ సహాయం. మహిళల భద్రత : ఆపద సమయంలో మహిళలకు ప్రత్యేక రక్షణ. సైబర్‌ మోసం: సైబర్‌ మోసాలు, సైబర్‌ నేరాల ఫిర్యాదుల పరిష్కారం. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ : పిల్లలకు సంబంధించిన అత్యవసర రక్షణ సేవలు. విపత్తు నిర్వహణ: ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు. విద్యుత్‌ శాఖ : విద్యుత్‌ ప్రమాదాలు లేదా అత్యవసర విద్యుత్‌ సమస్యలు. జీహెచ్‌ఎంసీ/మున్సిపల్‌ సేవలు : నగరపాలక సంస్థ పరిధిలోని అత్యవసర సమస్యలు. హైడ్రా: విపత్తు నిర్వహణ, ఆపద సహాయక విభాగాలు. ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌: విదేశాలు లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రవాసుల సహాయం. న్యాయ సహాయం: తక్షణ చట్టపరమైన సలహాలు, సూచనలు. మిస్సింగ్‌: తప్పిపోయిన లేదా ఎత్తుకుపోయిన వ్యక్తుల కోసం. రైల్వే: రైల్వే ప్రమాదాల్లో సహాయం. సీనియర్‌ సిటిజన్‌: వృద్ధులు ఆపదలో ఉన్నప్పుడు సహాయం. టూరిస్టులు: పర్యాటక కేంద్రాల్లో లేదా ప్రయాణంలో ఇబ్బందులు వచ్చినప్పుడు. ఆర్గాన్‌ డొనేషన్‌: అత్యవసరంగా అవయవాలు అవసరమైనప్పుడు. గ్యాస్‌ లీక్‌: ఇళ్లలో వంట గ్యాస్‌ లీక్‌ అయితే వెంటనే సహాయం.

డయల్‌ 100కు గుడ్‌బై పోలీస్‌, ఫైర్‌, అంబులెన్స్‌తోపాటు 18 రకాల సేవలకు ఒకే నంబర్‌

డిజిటల్‌ అనుసంధానం: రాష్ట్రవ్యాప్తంగా 31 పోలీస్‌ యూనిట్ల పరిధిలో పెట్రోలింగ్‌ చేసే 788 కార్లు, 1,072 బైకులను డిజిటల్‌గా అనుసంధానించారు. సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా గుర్తించి పంపిస్తుంది.

కాల్‌ ఫిల్టరింగ్‌: అనవసరమైన ఫేక్‌ కాల్స్‌, స్పామ్‌, సైలెంట్‌, చైల్డ్‌ కాల్స్‌ను ప్రాథమిక స్థాయిలోనే ఫిల్టర్‌ చేసి అసలైన అత్యవసర కాల్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.

వాయిస్‌–టు–టెక్ట్స్‌: మాట్లాడే సంభాషణను ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌లోకి మారుస్తుంది.

కచ్చితమైన లొకేషన్‌ గుర్తింపు: గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ప్రస్తుతం 94 శాతం కాలర్ల లొకేషన్‌ను కచ్చితంగా గుర్తిస్తోంది.

అత్యవసర సేవలు: పోలీస్‌ సహాయం, అగ్ని మాపక శాఖ, అంబులెన్స్‌, విపత్తు నిర్వహణ.

24/7 కాల్‌ సెంటర్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 24 గంటలూ సేవలందిస్తోంది. 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది పనిచేస్తున్నారు. రోజువారీ సుమారు 14 లక్షల కాల్స్‌ ఐవీఆర్‌కు చేరుతుండగా, 18 వేలు అత్యవసర కాల్స్‌ను స్వీకరిస్తున్నారు. సుమారు 7,500 సంఘటనలకు ఫీల్డ్‌ యూనిట్లను పంపుతున్నారు.

మంచిర్యాలక్రైం: డయల్‌ 100 అనగానే అందరూ టక్కున ఇది పోలీస్‌ స్టేషన్‌ నంబర్‌ కదా అంటారు. నిజమే.. కానీ ఇది మొన్నటి వరకు. తెలంగాణ ప్రభుత్వం డయల్‌ 100కు స్వస్తి పలికింది. కొత్తగా డయల్‌ 112 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ కొత్త నంబర్‌ ప్రవేశపెట్టారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌, అత్యవసర సేవల దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో నెక్ట్స్‌ జనరేషన్‌ డయల్‌ 112 ప్లాట్‌ఫాం ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో బాధితులకు డయల్‌ 112 మొదటి రక్షణ కవచంగా పనిచేస్తోంది.

డయల్‌ 112 ప్రత్యేకతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement