పెంచికల్‌పేట్: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యం పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రాజ్‌కుమార్, ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా దహేగాం మండలంలోని చిన్నరాస్పల్లి నుంచి టాటాపికప్ వాహనంలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న కాగజ్‌నగర్‌కు చెందిన ఖాజా, అస్లాం హుస్సేన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపా రు. పంచనామ అనంతరం బియ్యాన్ని ఆర్‌ఐ రాజేశ్వర్‌రావుకు అప్పగించినట్లు తెలిపారు.


