ఇచ్చోడ: రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15న పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్‌కార్డుల్లో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. మండలంలోని అడేగామ కే పంచాయతీ పరిధిలోని అడేగామ(కే), ఆదర్శనగర్, ఎస్సీకాలనీ, గుబ్బ గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఊరు పేరే మారింది. అడేగామ(కే)కు బదులుగా అడేగామ (బి) అని రావడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. అధికారుల తప్పిదంతో 821 రేషన్ కార్డులపై అడేగామ బి పేరును తప్పుగా ముద్రించారు. అడెగామ (కే) పేరుతో ఉన్న కార్డులు పంపిణీ చేయాలని రేషన్ లబ్ధిదారులు కోరుతున్నారు.


