మంచిర్యాలటౌన్: రాష్ట్రంలోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ యువతుల వివాహానికి ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వం సైతం ఆయా పథకాలను కొనసాగిస్తోంది. 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోల అమలుపై ఇటీవల హైకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు ఆదేశాలు ఇస్తూనే విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయా పథకాలపైనా స్టే విధించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ఈ పథకం ద్వారా వధువుకు రూ.1,00,116, దివ్యాంగులైన ఆడపిల్ల లకు రూ.1,25,145 ప్రభుత్వం చెక్కుల రూపంలో అందిస్తోంది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాను ఇచ్చే ఈ పథకాలపై హైకోర్టు స్టే లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పథకాన్ని అమలు చేసేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పెండింగ్ దరఖాస్తుదారుల్లో ఆందోళన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 38,839 మంది దరఖాస్తు చేసుకోగా 36,590 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం తహసీల్దార్ వద్ద 857 దరఖాస్తులు పెండింగులో ఉండగా, ఎ మ్మెల్యే అప్రూవల్ కోసం 286 దరఖాస్తులు ఉన్నా యి. తహసీల్దార్ నుంచి రిజెక్ట్ చేసినవి 379 దరఖా స్తులు ఉండగా, ఎమ్మెల్యేలు రిజెక్ట్ చేసినవి 19 ఉ న్నాయి. ఆమోదం పొంది బిల్లుకు సిద్ధంగా ఉన్నవి 113 కాగా, బిల్లులు సిద్ధం చేసి, ట్రెజరీ వద్ద పెండింగులో ఉన్నవి 143. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దా దాపుగా 1,825 వరకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు స్టే వల్ల చెక్కుల పంపిణీ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడినట్లయ్యింది. ఇప్పటికే ఆలస్యంగా చెక్కులు చేతికి అందుతుండడంతో లబ్ధిదారులకు ఆర్థికంగా ఇబ్బందిగా మారుతుండగా స్టేతో మరింత ఆలస్యం కానున్నాయి.
మండలం మొత్తం తహసీల్దార్ వద్ద అప్రూవ్‌కోసం ట్రెజరీలో ట్రెజరీ నుంచి
దరఖాస్తులు పెండింగ్ ఆర్డీవో వద్ద పెండింగ్ బిల్స్ పాసైనవి
బెల్లంపల్లి 3,247 95 89 46 2,960
నెన్నెల 1,348 61 20 14 1,238
కాసిపేట 1,616 53 20 24 1,493
తాండూర్ 1,716 47 4 2 1,603
కన్నెపల్లి 1,051 38 1 11 986
భీమిని 818 33 0 4 749
వేమనపల్లి 1,110 26 5 12 1,035
మందమర్రి 3,408 124 22 0 3,177
మంచిర్యాల 3,741 89 0 0 3,562
నస్పూర్ 2,022 56 58 0 1,886
చెన్నూర్ 3,102 53 52 0 2,936
కోటపల్లి 1,997 53 5 0 1,902
లక్సెట్టిపేట 2,950 45 0 0 2,821
జన్నారం 3,189 24 56 0 3,082
హాజీపూర్ 1,712 23 0 0 1,626
భీమారం 834 18 16 0 782
దండేపల్లి 3,050 14 53 0 2,886
జైపూర్ 1,928 5 25 0 1,866
మొత్తం 38,839 857 426 113 36,590
పథకం కింద ఈ నెల 11 వరకు వివరాలు


