స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ఏది? | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ఏది?

Aug 16 2026 11:29 PM | Updated on Aug 16 2026 11:29 PM

మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై కేంద్ర ప్రభుత్వ ముద్ర, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ కార్డులపై సీఎం, మంత్రి ఫొటో పెట్టుకుని, శాశ్వతరాజులాగా రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నాడని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార ముద్రలతో రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు గాజుల ముఖేష్‌ గౌడ్‌, దుర్గం అశోక్‌, పెద్దపల్లి పురుషోత్తం, బేర సత్యనారాయణ, గోలి రాము, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, తుల ఆంజనేయులు, రాజ్‌కుమార్‌, పట్టి వెంకటకృష్ణ, సతీశ్‌రావు, స్వప్నరాణి, జయరామరావు, శ్రీశైలం, శ్రీనివాస్‌, లచ్చన్న, చిరంజీవి, రాకేశ్‌ రెన్వా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement