జన్నారం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. ఆదివారం కిష్టాపూర్‌లోని కేజీబీవీని సందర్శించారు. పాఠశాల పరిసరాలు, వంట గది, భోజనం పరిశీలించారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా వారి వద్దకు వెళ్లి కూర, అన్నం ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.50 లక్షలతో నిర్మిస్తున్న డార్మెంటరీ, మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత ఏఈతో మాట్లాడి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో రాజేందర్, కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీవాణి, తదితరులు ఉన్నారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
దండేపల్లి: మండలంలోని రెబ్బనపల్లి శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య సూచించారు. ఆదివారం నిర్మాణ పనులు పరిశీలించారు. రాబోయే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎంఈవో మంత్రి రాజు, ఎంపీవో కేవీ ప్రసాద్, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, సర్పంచ్ కల్యాణి, ఉప సర్పంచులు వినోద్, నవీన్, తదితరులు ఉన్నారు.


