చెరువుల రక్షణకు పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

చెరువుల రక్షణకు పాదయాత్ర

Aug 16 2026 11:29 PM | Updated on Aug 16 2026 11:29 PM

జన్నారం: మండలంలోని రేండ్లగూడలో కబ్జా కు గురవుతున్న చెరువులను రక్షించాలని కోరు తూ గ్రామానికి చెందిన సముద్రాల శంకర్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించాడు. శంకర్‌ మాట్లాడుతూ మండలంలోని పలు చెరువులు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. జన్నారం నుంచి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్‌కు విన్నవిస్తానని పేర్కొన్నాడు. ‘చెరువు మా జీవం.. చెరువు మన భవిష్యత్‌’ అనే నినాదంతో పోరాటం చేస్తానన్నాడు. ఈ సంకల్పానికి కలెక్టర్‌ స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement