మంచిర్యాలక్రైం: న్యాయవాదులు వృత్తి పరమైన ఒత్తిడిని అధిగమించేందుకే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీ.వీరయ్య పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. న్యాయవాదులు ఐదు టీమ్‌లుగా ఏర్పడి పోటీలో తలపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్ జట్లు హోరాహోరీ గా తలపడగా ఎల్లో టీమ్ 59 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. గ్రీన్ టీమ్ 98 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్త సత్త య్య, శ్రీనివాస్, సదానందం, సురేంద్ర ఉపాధ్యాయ, నిషాంత్ గాంధీ, ఆంజనేయులు, గంగయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.


