మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేలా కృషి చేయాలని జి ల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ సూచించారు. మంగళవారం గర్మిళ్ల ఉన్నత పాఠశాలలో 18 మండలాలకు చెందిన 61మంది మండల సై న్స్ కోర్డినేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ప ర్యావరణ పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో ఏడో స్థా నంలో కొనసాగుతుందని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు క్విజ్‌లో పాల్గొనేలా చూసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలని సూ చించారు. ఇన్‌స్పైర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, జాతీయ పర్యావరణ పోటీలు, సై న్స్ డ్రామా, సైన్స్ సెమినార్, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలపై రిసోర్స్ పర్సన్లు శ్రీని వాస్, సురేందర్, అర్చన శిక్షణ ఇచ్చారు. సై న్స్ కో ఆర్డినేటర్ల సందేహాలను నివృత్తి చేశా రు. సెక్టోరల్ అధికారులు సత్తయ్య, భరత్, ఇన్‌చార్జి హెచ్‌ఎం కరుణాకర్ పాల్గొన్నారు.


