నెన్నెల: ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నెన్నెల, కన్నెపల్లి మండలాలకు నూతన తహసీ ల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలకు రూ.4.50 కోట్లు మంజూరైనట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తెలిపారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు చెప్పారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ని ధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపా రు. నెన్నెల, కన్నెపల్లి మండలాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వినోద్‌కు స్థాని కులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మంచిర్యాల డీసీసీ ఉపాధ్యక్షుడు బొమ్మెన హరీశ్‌గౌడ్ తదితరులున్నారు.


