గతుకుల గమనం | - | Sakshi
Sakshi News home page

గతుకుల గమనం

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

ఎమ్మెల్యే ఇంటి నుంచి హైటెక్‌సిటీ కాలనీకి వెళ్లే రోడ్డు ఇలా..

హైటెక్‌సిటీ కాలనీలోని రోడ్లపై భారీ గుంతలు

హైటెక్‌సిటీ కాలనీ ప్రధాన రోడ్డుపై అడుగుకో గుంత

మంచిర్యాల నగరంలోని రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారాయి. అడుగుకో గుంత ఏర్పడి వాహనదారులు, పాదచారులకు చుక్కలు చూపెడుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. హైటెక్‌సిటీ కాలనీలోని రోడ్లు కూడా గుంతలతో నిండిపోయాయి. ఈ రహదారులతో వాహన చోదకులు, నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కనీసం మరమ్మతులు చేపట్టి తమ ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. – మంచిర్యాలటౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement