భీమిని/మంచిర్యాల క్రైం: మంచిర్యాల, కన్నెపల్లి పోలీస్‌స్టేషన్లను మంగళవారం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) బృందం సభ్యులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించా రు. పోలీస్‌స్టేషన్‌లో స్మార్ట్ పోలీసింగ్ అమలు, పోలీస్‌స్టేషన్ల ఆధునికీకరణతో పాటు పౌ రులకు అందుతున్న సేవలు, ఎఫ్‌ఐఆర్‌ల వి వరాలు, పోలీస్ అధికారుల విధులు, కేసుల వివరాలు, స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, సాంకేతిక వినియోగం, పారిశుద్ధ్యం తదితర 200 అంశాలపై ఆరా తీశారు. పట్టణ, గ్రామీ ణ ప్రాంతాల్లో పోలీస్ సేవలను క్షుణ్ణంగా పరి శీలించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదికలు అందించనున్నట్లు క్యూసీఐ బృందం స భ్యులు తెలిపారు. వారి వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్, మంచిర్యాల సీఐలు దేవయ్య, ప్రమోద్, కన్నెపల్లి ఎస్సై విక్రమ్, సిబ్బంది పాల్గొన్నారు.


