‘చలో ఢిల్లీ విజయవంతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘చలో ఢిల్లీ విజయవంతం చేయాలి’

Aug 10 2026 1:16 AM | Updated on Aug 10 2026 1:16 AM

నస్పూర్‌: కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 1న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. ఆదివారం షిర్కే సెంటర్‌లో సీపీఐ ప్రజాపోరు యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్‌, కారుకూరి నగేశ్‌, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్‌కే బాజీసైదా, నాయకులు జోగుల ఆంజనేయులు, కిషన్‌రావు, చిలుక రాంచందర్‌రావు, సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement