ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి

Aug 10 2026 1:16 AM | Updated on Aug 10 2026 1:16 AM

పాతమంచిర్యాల: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలని తెలంగాణ గిరిజన కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోట్నాక తిరుపతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక షంక్షన్‌ హాల్‌లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కుమురంభీం చిత్రపటానికి, అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అంతకు ముందు ఐబీ చౌరస్తా నుంచి చేపట్టిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీల జీవన ప్రమాణాలు పెరగడంలేదన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటవీహక్కుల చట్టం పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏటీడీవో సురేష్‌, ఏసీఎంవో లక్ష్మణ్‌, కార్పొరేటర్‌ రాచకొండ గోపాల్‌రావు, ఆదివాసీ నాయక్‌పోడ్‌, చెంచు, పర్థాన్‌, కోయ, మన్నేవార్‌, తోటి, కొలవార్‌, గోండు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అధికారికంగా నిర్వహించాలి

చెన్నూర్‌: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వ ం అధికారికంగా నిర్వహంచాలని ఆదివాసీ హక్కు ల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేక శేఖర్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఆయన మాట్లాడు తూ మంచిర్యాలలో మినీ ఐటీడీఏను ఏర్పాటు చేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశా రు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాంతయ్య, అధికార ప్రతినిధి రమేశ్‌, నాయకులు వెంకటేశ్‌, సమ్మయ్య, లక్ష్మణ్‌, మధుకర్‌, సంతోష్‌, పున్నం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement