ఆస్పత్రిలో పోస్టుల ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ప్రస్తుతం ఆసుపత్రిలోని పలు విభాగాల్లో వైద్యుల పోస్టులతో పాటు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో అన్నిరకాల శస్త్ర చికిత్సలు చేయడం లేదు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు.
– డాక్టర్ అశోక్ కుమార్,
జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్


