కోయగూడెం బొగ్గు బ్లాక్‌ సింగరేణికి కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

కోయగూడెం బొగ్గు బ్లాక్‌ సింగరేణికి కేటాయించాలి

Aug 10 2026 1:16 AM | Updated on Aug 10 2026 1:16 AM

శ్రీరాంపూర్‌: కోయగూడెం ఓసీపీ–3, జేవీఆర్‌ ఓసీపీ–3 బొగ్గు బ్లాకులను సింగరేణికి నేరుగా కేటాయించాలని కోరుతూ బీఎంఎస్‌ నాయకులు ఆదివారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ.కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏబీకేఎంఎస్‌ జాతీయ కార్యదర్శి మాదవ్‌నాయక్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు పులి రాజారెడ్డి, సింగరేణి విభాగం అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యాదగిరి సత్తయ్య హైదరాబాద్‌లో కేంద్ర మంత్రిని కలిసి మణుగూరు పీకే ఓసీపీ–2 డిఈప్‌ సైడ్‌ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు బ్లాకులను కూడా సింగరేణికి కేటాయిస్తే సంస్థకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయూనియన్‌ నాయకులు వడ్లేపల్లి కుమారస్వామి, జీవీ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

మంచిర్యాలటౌన్‌: స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ డెఫ్‌ కమిటీని ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ది డెఫ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ వాలియుద్దీన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిష్టాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గొర్రె దేవయ్య, ఉపాధ్యక్షుడిగా జిల్లి చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా జూపాక అరుణ్‌ కుమార్‌, జాయింట్‌ సెక్రటరీగా ఎనుముల కుమార్‌, కోశాధికారిగా పారుపల్లి చక్రధర్‌, ఈసీ మెంబర్లుగా గేడం రాజేశ్వర్‌, మోటపలుకుల ప్రశాంత్‌, ఎండీ. యాసిర్‌ అఫరాత్‌, అడ్వైజర్‌గా వెన్నమనేని ప్రసాద్‌రావు ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement