కడెం: ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం పంటలకు అందించే సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్ అన్నారు. ఆదివారం కడెం ఎడమ, కుడి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించి, సాగునీటి విడుదలపై ప్రకటన చేసిందని, దీనికి కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌రెడ్డి, మాజీ డిస్ట్రిబూటరీ కమిటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, సర్పంచ్ విజయ్, ఈఈ ప్రవీణ్, డీఈఈ వీరన్న, ఏఈఈలు ఉన్నారు.


