కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని సంతోషి గోల్డ్ వర్క్ నగల దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. 40 గ్రాముల బంగారు, కిలో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేస్తుండగా సీసీఫుటేజీలో రికార్డయింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మొబైల్‌షాపులో..
ముధోల్: మండల కేంద్రంలోని బస్టాండ్ కాంప్లెక్స్‌లోని రాజరాజేశ్వర్ మొబైల్ షాపులో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. షెటర్ తాళం పగులగొట్టి రెండు ఫోన్లు, ఒక పవర్ బ్యాంకు, రెండు ఇయర్‌బడ్స్ ఎత్తుకెళ్లినట్లు ఎస్సై బిట్లాపెర్సిస్ తెలిపారు. బాధితుడి జె.నరేశ్ ఫిర్యాదుతో ఆదివారం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


