పెరిగిన టెక్నాలజీని కంపెనీ అందిపుచ్చుకోవాలి. కంపెనీ వ్యాప్తంగా యూపీఐ చెల్లింపునకు అవకాశం కల్పించాలి. సమయం ఆదాతోపాటు లావాదేవిల్లో పారదర్శకత ఉంటుంది.
– కస్తూరి చంద్రశేఖర్,
సీఐటీయూ బ్రాంచి కార్యదర్శి
ప్రతిపాదనలు పంపిస్తాం
ఇప్పటివరకు ఏ ఏరియాలో డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేదు. ఎక్కువ మొత్తంలో ఉన్న పేమెంట్లు బ్యాంక్ ద్వారానే తీసుకుంటున్నాం. తక్కువ మొత్తం ఉంటే నగదు మాత్రమే కౌంటర్‌లో తీసుకుంటున్నాం. వీటిని యూపీఐ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాంతాం.
– సుమలత, ఏజీఎం(ఫైనాన్స్), శ్రీరాంపూర్


