టైగర్ రీ ఇంట్రడక్షన్‌కు ఎన్టీసీఏ గ్రీన్‌సిగ్నల్ ‘విజన్ 2047లో భాగంగా తడోబా, అందేరి నుంచి పులుల తరలింపు శాకాహార జంతువుల పెంపునకు చర్యలు చర్యలు తీసుకుంటున్న అటవీశాఖ
పులులు స్వేచ్ఛగా తిరిగే దట్టమైన అడవులను ‘క్యాచ్‌మెంట్ ఏరియాగా పరిగణిస్తారు. వర్షపు నీటిని గ్రహించి, నదులు, వాగుల్లో ఏడాది పొడవునా నీరు ప్రవహించేలా చేస్తాయి.
పులుల సంరక్షణకు కేటాయించిన ‘టైగర్ రిజర్వ్‌లు‘పెద్ద ఎత్తున కార్బన్ డై ఆకై ్సడ్‌ను గ్రహించి, ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇది భూతాపాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
పులులు ఉన్న అడవులకు పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
జన్నారం: కవ్వాల్ అడవుల్లో రాకపోకలకు సరిపెడుతున్న పులులు ఆవాసం ఏర్పాటు చేసుకునేలా కేంద్రం చర్యలు చేపట్టింది. కవ్వాల్‌లో ‘టైగర్ రీ ఇంట్రడక్షన్’(పులుల పునరావాసం) ప్రాజెక్ట్‌కు ఎన్టీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘విజన్–2047’రోడ్‌మ్యాప్‌లో భాగంగా కవ్వాల్‌లో పులుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ నుంచి ఐదు పులులను (కనీసం ఒక ఆడ పులితో కలిపి) తరలించేలా అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా అడవిలో పులి ఆవాసం ఉండేలా తగిన శాకాహార జంతువుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.
శాకాహార జంతువులసాంద్రత తక్కువ
కవ్వాల్ అడవుల్లో ప్రస్తుతం చదరపు కిలోమీటరుకు శాకాహార జంతువుల సాంద్రత తక్కువగా ఉంది. కొన్నేళ్లుగా అటవీ అధికారులు గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేస్తుండడంతో వాటి సంఖ్య పెరుగుతోంది. అడవిలో పులుల ఆవాసానికి, సంతానోత్పత్తికి చదరపు కిలోమీటరుకు కనీసం 30 నుంచి 40 (జింకలు, దుప్పులు, అడవి పందులు వంటి గిట్టలున్న జంతువులు) ఉండాలి. ప్రధానంగా మచ్చల జింక, సాంబార్ (దుప్పి), అడవి పంది, నీల్గాయ్ వంటి జంతువులు పులికి ప్రధాన ఆహారం. ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు సుమారు 4 నుంచి 5 పులులు ఉండాలంటే శాకాహార జంతువులు ఉండాలి. వీటి సంఖ్య పెంచి, అటవీ కారిడార్లను అభివృద్ధి చేసి, పులులను తరలించనున్నారు.
గ్రామాల తరలింపు
కోర్ ఏరియా పరిధిలోని మైసంపేట, రాంపూర్ వంటి గిరిజన గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జన్నారం అటవీ డివిజన్‌లోని మల్యాల, అలీనగర్, దొంగపల్లి గ్రామాలకు పునరావాసం కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మల్యాల గ్రామ ప్రజలకు పునరా వాసం కల్పించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే సర్వే చేసి పునరావాసం కల్పించే భూములను గిరిజనులను చూపించారు.
పులులతో కలిగే
ప్రధాన లాభాలు..
– పులులు అడవిలో దుప్పులు, అడవి పందులు, జింకలు వంటి శాకాహార జంతువులను వేటాడి వాటి జనాభాను అదుపులో ఉంచుతాయి. దీనివల్ల అడవుల్లోని చెట్లు, గడ్డి మైదానాలు మేత వల్ల నశించిపోకుండా కాపాడబడతాయి.
ఆదేశాలు రాలేదు
టైగర్ రీ ఇంట్రక్షన్‌పై ఎన్టీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. జన్నారం అటవీ డివిజన్‌లో గడ్డి క్షేత్రాలు పెంచడంతో ఏటేటా శాకాహార జంతువుల సంఖ్య పెరుగుతోంది. కవ్వాల్ టైగర్‌జోన్ పులికి అనువైన ప్రాంతం. పులితో వాతావరణం సమతుల్యత ఏర్పడుతుంది. – రామ్మోహన్, ఎఫ్‌డీవో


