చెన్నూర్/చెన్నూర్ రూరల్: జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. చెన్నూర్ మండలంలోని అక్కెపల్లి వాగుపై ఉన్న లోలెవల్ కాజ్‌వే వద్ద వాగు ఉధృతిని ఆయన పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అఽధికారులపై మంత్రి ఆగ్రహం..
భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మున్సిపాలిటీలోని 7 వార్డులో గల ఒడ్డెపల్లి కాల్వను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కాల్వపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్తే ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయల నగర పంచాయతీ నిధులతో వంతెన నిర్మాణం చేపడుతానని మంత్రి హామీ ఇచ్చారు.
కూలిన ఇళ్ల గోడలు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని సుందరసాలలో గుండ భాస్కర్‌రెడ్డి, నర్సక్కపేటలో నగరం బుచ్చయ్య, వేముల రాజయ్య, పాగెపల్లిలో పాగె దాదయ్య ఇంటిగోడలు కూలి పోయాయి.


