నేరడిగొండ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని కుంటాల(కె) గ్రామంలో రైతు రాథోడ్ సచిన్ కుమార్‌కు చెందిన పశువుల పాక కుప్పకూలింది. ఈ ఘటనలో పాకలో ఉన్న ఓ ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పశువైద్యాధికారి రాథోడ్ జీవన్‌కు సమాచారం అందించగా గురువారం గాయపడిన ఎద్దుకు చికిత్స అందించారు. భారీ వర్షాల సమయంలో పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని రైతులకు సూచించారు.
పశువుల కొట్టం కూలి మూగజీవాలు మృతి
నార్నూర్: గాదిగూడ మండలం పిప్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో గురువారం కురిసిన భారీ వర్షాలకు పశువుల కొట్టం కూలిపోయింది. కొట్టంలో కట్టి ఉంచిన ఆవు, దూడ, మేక శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొడప మారు కుటుంబం జీవనోపాధికి ఆధారంగా ఉన్న పశువులను కొట్టంలో కట్టి ఉంచగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పశువుల కొట్టం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది.


