మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలివాడకు చెందిన నిమ్మల విజయ్‌కుమార్ (39) బైక్‌పై వెళ్తూ స్కూల్ కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజయ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. హమాలివాడలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి స్కూల్ కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయ్‌కుమార్‌కు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.


