సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్‌గా పొట్టపల్లి మహిళ | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్‌గా పొట్టపల్లి మహిళ

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

లక్ష్మణచాంద: రాష్ట్ర స్థాయిలో సీ్త్రనిధి డైరెక్టర్‌గా మండలంలోని పొట్టపల్లి గ్రామానికి చెందిన గంగామణి ఎంపికయ్యారు. రాష్ట్ర సీ్త్రనిధి సహకార పరిమితి సొసైటీ మహిళా బ్యాంకు 5 డైరెక్టర్ల స్థానాలకు మంగళవారం హైదరాబాద్‌లోని సెర్ప్‌ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలను బుధవారం ప్రకటించారు. ఎన్నికల్లో ఒక డైరెక్టర్‌గా మండలంలోని పార్‌పెల్లి గ్రామానికి అనుబంధ గ్రామం పొట్టపల్లి గ్రామవాసి, నిర్మల్‌ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి ఎంపికయ్యారు. వీరిని రాష్ట్ర మంత్రి సీతక్క అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement