కాపర్‌ వైర్‌ చోరీ నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కాపర్‌ వైర్‌ చోరీ నిందితుడు అరెస్ట్‌

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

భైంసా: పట్టణంలో కాపర్‌ వైర్‌ చోరీ కేసును పోలీసులు ఛేదించి ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నారు. భైంసారూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా శివాజీచౌక్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి శ్రీరాం జనార్ధన్‌ ఈ నెల 27న తన ఇంటికి తాళం వేసి వెళ్లి, 28న తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక భాగంలోని గోడ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న కరెంట్‌ వైరింగ్‌ను కత్తిరించి సుమారు 10 కిలోల కాపర్‌ వైర్‌ చోరీ చేశారు. దీంతో బాధితుడు భైంసా టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాల సహాయంతో భైంసా పట్టణానికి చెందిన స్క్రాప్‌ వ్యాపారి షేక్‌ నజీర్‌ను అరెస్ట్‌ చేశారు. కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు బాలలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఫిర్యాదుదారుడి ఇంటి నుంచి చోరీ చేసిన 7 కిలోల కాపర్‌ వైర్‌, కరిగించి తయారు చేసిన 30 కిలోల కాపర్‌ వైర్‌, 7.2 కిలోల కాపర్‌ వైర్‌ బండిల్స్‌, మరో బాలుడి వద్ద ఉన్న 4 కిలోల కాపర్‌ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసిన పోలీసు బృందాన్ని భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌ అభినందించారు.

అశ్రునయనాల మధ్య

అంత్యక్రియలు

లక్ష్మణచాంద: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన నిత్యానంద రెడ్డి(24) అంత్యక్రియలు బుధవారం మండలంలోని నర్సాపూర్‌(డబ్ల్యూ) గ్రామంలో కుటుంబ స భ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నర్సాపూర్‌ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీనివాస్‌ రెడ్డి –విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానంద రెడ్డి మూడేళ్ల క్రితం అమెరికాలోని డెట్రాయిట్‌కు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 18న బైక్‌ పై వెళ్లే సమయంలో బైక్‌ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 23న మృతి చెందాడు. బుధవారం మృతదేహం స్వగ్రామం చేరడంతో గ్రామంలో విషాధచాయలు అలు ముకున్నాయి. అంత్యక్రియల్లో నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావుతో పాటు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సోమా భీంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రు నరేశ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement