బెల్లంపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వరగౌడ్ ఆరోపించారు. బెల్లంపల్లి ఆర్యవైశ్య భవన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రతీ బూత్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని, బోగస్ ఓట్లు తొలగించేలా సహాయ పడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సమస్యలపై మండల స్థాయిలో ఆందోళనలు నిర్వహించడానికి కార్యాచరణ తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఇన్‌చార్జి కె.ఓదెలు, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, నాయకులు వెంకటకృష్ణ, పురుషోత్తం, ఆంజనేయులు, ఏమాజీ, జరినిష్ జైన్, రాచర్ల సంతోష్, కళ్యాణి, రామ్మూర్తి, రమేశ్ తదితరులున్నారు.


