మంచిర్యాలటౌన్: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 11నుంచి 18వరకు నిర్వహించనున్న ఆరోగ్య కార్యక్రమాలు, జనాభా నియంత్రణ అవగాహన పోస్టర్, కరపత్రాలను డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పతుల్లో వైద్యులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు కుటుంబ నియంత్రణ పద్ధతులు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ అశోక్, డాక్టర్ తబియా, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, డెమో వెంకటేశ్వర్, డీపీహెచ్‌ఎన్ ఆర్‌ఎస్ పద్మ, సీహెచ్‌వోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నాందేవ్, ప్రవళిక పాల్గొన్నారు.


