క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

మంచిర్యాలఅర్బన్‌: మానసికోల్లాసం, శారీరక దృఢత్వానికి చదువుతో పాటు క్రీడలు అవసరమని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. జిల్లా సైన్స్‌ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలంటే వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి యాకుబ్‌ గత విద్యాసంవత్సరంలో నిర్వహించిన స్కూల్‌ గేమ్స్‌ వివరాలు వెల్లండించారు. 2026–27 విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సిన క్రీడా పోటీల ప్రణాళికపై చర్చించారు. సెక్టోరల్‌ అధికారులు సత్తయ్య, భరత్‌, పీడీ, పీఈటీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement