మంచిర్యాలఅర్బన్: నూతన విద్యాసంవత్సరం ప్రా రంభమై దాదాపు నైలెనా విద్యార్థులకు ఇంకా యూ నిఫాంలు అందలేదు. దీంతో చిరిగిన, పొట్టి, పాత దుస్తుల్లోనేమ విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. ముడి వస్త్రం సరఫరాలో జాప్యం కారణంగా జిల్లాలో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు ‘ఇంకా రాలేదు.. త్వరలో వస్తాయి’ అని సమాధానమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం రోజే మొదటి దపాలో ఒక జత, తర్వాత రెండో జత యూనిఫాంలు అందించేవారు. మార్చిలోనే పిల్లల కొలతలు తీసుకునేవారు. యూనిఫాం క్లాత్ రాగానే స్వయం సహాయక సంఘాలకు అందిస్తే కుట్టించి సిద్ధం చేసేవారు. ఈ ఏడాది క్లాత్ రాకపోవటంతో యూనిఫాంలు కుట్టేదెప్పుడు.. విద్యార్థులకు అందించేదెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది.
పాఠశాలలు, విద్యార్థుల వివరాలు
జిల్లాలో 1,051 ప్రభుత్వ పాఠశాలలుండగా 1,32,322 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 234 ప్రైవేట్ పాఠశాలల్లో 70,273 విద్యార్థులను మినహాయిస్తే మిగతా విద్యార్థులందరికీ యూనిఫాంలు అందించాల్సి ఉంది. కేజీబీవీల్లో 8,154 జతలకు గాను 3,588 యూనిఫాంలు మా త్రమే కుట్టడం పూర్తయింది. 47,152 మీటర్ల క్లాత్ (మెరూన్ సూటింగ్, చెక్స్ షర్టింగ్, పంజాబీ బాట మ్) కేటాయించారు. కాసిపేట, కోటపల్లి బ్రాంచ్‌ల కు సంబంధించి జత టాప్ క్లాత్ మాత్రమే అంది నట్లు తెలుస్తోంది. ఎనిమిది ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్‌ఎస్‌లో 5,500 మంది విద్యార్థులకు గాను 3,020 మంది విద్యార్థులు, 2,480 మంది విద్యార్థినులున్నారు. వీరికి 22,749 మీటర్ల మెరూన్, చెక్స్ క్లాత్‌ను పంపిణీ చేశారు. విద్యార్థినులకు పూర్తి స్థాయిలో స్టిచ్చింగ్ ఉండగా బాలురకు మాత్రం పా యింట్ క్లాత్ అందజేసినట్లు తెలుస్తోంది. నాలుగు సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో విద్యార్థినుల యూని పాంల స్టిచ్చింగ్ పూర్తి స్థాయి దశకు చేరుకోగా ఐదు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియళ్లలో బాలురకు మాత్రం పాయింట్ క్లాత్ చేరినట్లు సమాచారం. మిగతా ఆశ్రమ పాఠశాలలు, మైనార్టీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చెందిన యూనిఫాం క్లాత్ సరఫరా కావాల్సి ఉంది. దీంతో విద్యార్థులు సాధారణ దుస్తుల్లో వస్తుండగా.. మరికొందరు మాసిన, చిరిగిన దస్తులతో వస్తున్నారు.
ముడివస్త్రం సరఫరాలో గందరగోళం
పాఠశాలలకు అందించే యూనిఫాంకు అవసరమైన ముడివస్త్రం సరఫరాపై గందరగోళం నెలకొంది. జిల్లాకు ఎంత క్లాత్ రానుంది? ఎప్పుడు సరఫరా జరుగుతుందో.. విద్యాశా ఖ అధికారులకే తెలియడంలేదు. యూనిఫాం క్లాత్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నేరుగా పాఠశాలలకు, అక్కడి నుంచి స్వయం సహాయక సంఘాలకు చేర్చుతుండటంతో సమాచారం లేకుండాపోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం వరకైనా అందుతుందో లేదో తెలియని పరిస్థి తి ఉంది. ఇక కొత్తగా చేరిన విద్యార్థులకు యూనిఫాంలు ఎప్పడు అందిస్తారనే విషయమై స్పష్టత లేదు.


