నస్పూర్: సర్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాములు సూచించారు. శుక్రవారం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు జీపీవో లు, బీఎల్వోలు, బీఎల్‌ఏ, సూపర్‌వైజర్లు, అధి కారులతో సమావేశం నిర్వహించి క్షేత్ర స్థాయిలో ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాల పింపిణీ, డిజిటలైజేషన్ పూర్తి చేయాలని, సమాచార నమోదు, సేకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. తహసీల్దార్ సంతోష్, డిప్యూటీ తహసీల్దార్ హరిత, సిబ్బంది పాల్గొన్నారు.


