
స్వగ్రామానికి చేరిన మృతదేహం
దస్తురాబాద్: ఉజ్బెకిస్థాన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన మండలంలోని మున్యాల గ్రామపంచాయతీలోని పెద్దూర్‌కు చెందిన సంగ సురేష్ (35) మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. గత నెల 22న ఉజ్బెకిస్థాన్‌లో పనిచేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు.
తప్పిన ప్రమాదం
లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లి నుంచి నిర్మల్ వెళ్లే ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. మంగళవారం పార్‌పెల్లి నుంచి నిర్మల్ బయలుదేరిన ఆర్టీసీ బస్సు పీచర–రాచాపూర్ గ్రామాల మధ్య అకస్మాత్తుగా ఎదురుగా వాహనం రావడంతో డ్రైవర్ బస్సును నెమ్మదిగా రోడ్డు కిందకు దించాడు. లేదంటే పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లేదని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం తప్పిందన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు న వోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ, 10వ తరగతి చ దువుతున్న విద్యార్థులు 2025 సెప్టెంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2026,
ఫిబ్రవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కలిసి కట్టుగా కట్టారు..
సిరికొండ: మూడు రో జులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని రిమ్మ గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తడంతో మంగళవారం రిమ్మ, తిమ్మాపూర్ గ్రా మస్తులంతా కలిసి కట్టుగా కొట్టుకుపోయిన రో డ్డుతో పాటు రోడ్డు పక్క న గల రాళ్లకట్టకు ఇలా మరమ్మతులు చేశారు.

స్వగ్రామానికి చేరిన మృతదేహం

స్వగ్రామానికి చేరిన మృతదేహం