
ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల తొలగింపు
● మరొకరికి చార్జ్‌మెమో
వేమనపల్లి: మండలంలోని ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఫేక్ అటెండెన్స్ పంపించిన కారణంగా ప్రభుత్వం వారిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు డీపీవో కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సుంపుటం కార్యదర్శి వెంకటి, దస్నాపూర్ కార్యదర్శి రజిత, చామనపల్లి కార్యదర్శి యాదగిరిని విధుల నుంచి తొలగించగా ముల్కలపేట కార్యదర్శి సురేష్‌కు చార్జ్‌మెమో, ఎంపీడీవో కుమారస్వామికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సమయపాలన పాటించకుండా పాత ఫొటోను తీసి క్షేత్ర స్థాయిలో విధుల్లో ఉన్నట్లు ఫేక్ అటెండెన్స్ పంపించడంతో ముగ్గురిపై వేటు పడింది.
వర్షానికి కూలిన ఇళ్లు
దస్తురాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన గుండ లక్ష్మి, మండల కేంద్రంలోని గంప భారతకు చెందిన ఇల్లు కూలిపోయాయి. కూలిన ఇళ్లను తహసీల్దార్ విశ్వంబర్, పంచాయతీ కార్యదర్శి పరిశీలించారు.
సాత్నాల: ఇటీవల కురుస్తున్న వర్షాలకు భోరజ్ మండలంలోని ఆకోలి గ్రామానికి చెందిన ఆ త్రం రంగనాథ్ ఇల్లు కూలింది. మంగళవారం అకస్మాత్తుగా గోడలు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. కూ లీపని చేసుకుని జీవనం సాగించే తమకు ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేదని, శాశ్వత గృహం మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో
కాంగ్రెస్ నేత వాంగ్మూలం
భీమారం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మా రిన ఫోన్‌ట్యాపింగ్‌లో భీమారం మండల కాంగ్రెస్ నేత పొడేటి రవి ఇటీవల సిట్ విచారణకు హాజరైనట్లు ఆలస్యంగా తెలిసింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తమేనని రవి ‘సాక్షి’కి మంగళవారం తెలిపా రు. ఈ మేరకు విచారణలో శాసనసభకు జరి గిన ఎన్నికల్లో చెన్నూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగదు తరలిస్తుండగా మందమర్రి ఏరి యాలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు క దా అని, అప్పట్లో ఇబ్బందికరంగా ఏమైనా ఫో న్లు వచ్చాయా అని సిట్ అధికారులు ప్రశ్నించి ట్లు తెలిపారు. తాను కాంగ్రెస్‌పార్టీకి విధేయుని గా ఉన్నందునే అప్పటి ప్రభుత్వం తనఫోన్ ట్యాప్ చేయించిందని, ఈ విషయం అధికారులు తనకు చెప్పేంత వరకు తెలియదని అన్నారు.