
ఆర్జీయూకేటీలో ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసర ఆర్జీయూకేటీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్‌లో పీయూసీ2 పూర్తి చేసుకుని ఇంజనీరింగ్‌లో విభాగంలో చేరిన కొత్త విద్యార్థులకు మంగళవారం ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రత్యేక అతిథిగా ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఆర్జీయూకేటీలో 2025 పాఠ్యక్రమం అమలులోకి వచ్చినట్లు తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కరికులం రూపకల్ప న చేయబడిందని, అన్ని ఇంజనీరింగ్ బ్రాంచులకు సమాన ప్రాధాన్యత లభించేలా రూపొందించబడిందన్నారు. ఓఎస్‌డీ మాట్లాడుతూ మనం కేవలం ఉద్యోగాలు పొందడమే కాకుండా కొత్త ఉద్యోగా ల ను సృష్టించి దేశానికి సేవ చేయాలని లక్ష్యంగా పె ట్టుకోవాలన్నారు. అసోసియేట్ డీన్స్ డాక్టర్ మహే శ్, డాక్టర్ వీ.చంద్రశేఖర్రావు, సీఎస్సీ విభాగాధిపతి డాక్టర్ వెంకట్రామన్, తదితరులు పాల్గొన్నారు.