
సమృద్ధిగా యూరియా నిల్వలు
కోటపల్లి: జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మండలంలోని పార్‌పల్లి జాతీయరహదారిపై ఏ ర్పాటు చేసిన ఆంతర్రాష్ట్ర చెక్‌పోస్టును సీపీ అంబర్ కిషోర్ ఝా, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం ద్వారా యూరియా అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జి ల్లాలో 2,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 500 మెట్రిక్ టన్నులు ఎక్కువగా విక్రయించినట్లు పేర్కొన్నారు. యూరియా లేదనే అవాస్తవాన్ని ఎవ రూ నమ్మవద్దని సూచించారు. డ్రోన్లతో పిచికారీ చేసే నానో యూరియా చెన్నూర్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. ఆయన వెంట సీఐలు దేవేందర్‌రావు, బన్సీలాల్, ఎస్సై రాజేందర్, ఏఈవో రాజకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేయర్ల పాత్ర కీలకం
మంచిర్యాలఅగ్రికల్చర్: భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్‌కుమార్ దీప క్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో బ్యాచ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి భూకొలతల శాఖ అధికారి శ్రీనివాస్‌తో కలి సి హాజరై మాట్లాడారు. చట్టంలోని పూర్తి వివరాలు తెలుసుకుని విధులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని సర్వేయర్లకు సూచించారు.