
వరద బాధితులను ఆదుకోవాలి
మంచిర్యాలటౌన్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు వరద నీటిలో ముంపునకు గురవుతున్నాయని, తక్షణమే అధికారులు స్పందించి, సహాయక చర్యలు చేపట్టి ముంపు బాధితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో వరద నీటిలో మునిగిన కాలనీ రోడ్లు, ఇళ్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్‌కు ఫోన్ చేసి వరద నీటితో ఇబ్బంది పడుతున్న కాలనీ ప్రజల సమస్యలను వివరించారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని, ఇళ్లలోకి చేరిన వరద నీరు, డ్రెయినేజీల్లో పేరుకుపోయిన చెత్త తొలగించాలని తెలిపారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లి, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నందున పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్, అంకం నరేశ్, తోట తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, కర్రు శంకర్, జెట్టి చరణ్ పాల్గొన్నారు.