
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావులతో కలిసి అర్జీలు స్వీకరించారు. కాసిపేట మండలం పెద్దనపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన సఫిరా, అబ్దుల్ బి తాము 59జీవో ప్రకారం భూ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుని రుసుం చెల్లించామని, పట్టా మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు అందజేశారు. మంచిర్యాలకు చెందిన దూట లక్ష్మణ్ తాను కొనుగోలు చేసిన భూమికి భూభారతి చట్టం ప్రకారం పట్టా మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ జీరో బిల్లు రావడం లేదని నస్పూర్‌లోని గణేష్‌నగర్‌కు చెందిన బాలసాని అనిత దరఖాస్తు సమర్పించింది.