
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
తాండూర్: వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మండలంలోని బోయపల్లి ఎస్సీ కాలనీ, నర్సాపూర్ భీమన్న వాగు, తాండూర్, కొత్తపల్లి రైల్వే అండర్‌పాస్ పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ ఉండడంతో తలెత్తుతున్న ఇబ్బందులపై స్థానిక అధికారులతో చర్చించారు. రైల్వే అండర్‌పాస్ వద్ద నీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ జోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బహుజన సంక్షేమానికి సర్వాయి
పాపన్నగౌడ్ పోరాటం
మంచిర్యాలఅగ్రికల్చర్: బహుజన సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కలెక్టర్ కమార్ దీపక్ అన్నారు. సోమవారం సర్ధార్ పాపన్నగౌడ్ జయంతిని కలెక్టరేట్‌లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.