
సమస్యల పరిష్కారానికి కృషి
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, దళితులపై దాడులను అరికట్టడానికి ప్రత్యేక కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ(సీఓఈ) బాలుర విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. బాలికల విద్యాలయంలో ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. బూడిదగడ్డ బస్తీలో ఇటీవల కూల్చివేతకు గురైన వినాయక మండప నిర్మాణాన్ని పరిశీలించారు. కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, రాంబాబు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపీ రవికుమార్, తహసీల్దార్ కృష్ణ, దళిత సంఘాల నాయకులు చిలుక రాజనర్సు, రమేష్, నారాయణ, గోపాల్ పాల్గొన్నారు.