
‘గడ్డెన్నవాగు’కు వరద
‘స్వర్ణ’ రెండు గేట్లు ఎత్తివేత
ఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద
‘కడెం’ ఆరుగేట్లు ఎత్తివేత
మూడు గేట్ల ద్వారా దిగువకు వస్తున్న వరదనీరు
దిగువకు వెళ్తున్న వరదనీరు
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1089.2 అడుగుల (74.128 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. సోమవారం ప్రాజెక్ట్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు కొనసాగడంతో 34 గేట్లను ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద కాలువకు 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. – మామడ
పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం వరకు 4,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా మూడు గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దిగువన సుద్దవాగులో వరదనీటి ప్రవాహా నికి గణేశ్‌నగర్ వద్ద శివాలయం నీట మునిగింది. ఆటోనగర్ వెళ్లే బైపాస్ వంతెన పైనుంచి నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిపేశారు. – భైంసాటౌన్
మండలంతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా 6,425 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 9,205 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1181.1 అడుగుల వద్ద స్థిరంగా ఉంచుతున్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈ వేణుగోపాల్ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. – సారంగపూర్
కడెం ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం రాత్రి ప్రాజెక్ట్‌కు 42,285 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆరు వరద గేట్లను ఎత్తి 45,887 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.225 అడుగుల నీటిమట్టం ఉంది. – కడెం

‘గడ్డెన్నవాగు’కు వరద

‘గడ్డెన్నవాగు’కు వరద

‘గడ్డెన్నవాగు’కు వరద

‘గడ్డెన్నవాగు’కు వరద