
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ ఛాంబర్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం రాజుగూడకు చెందిన రాథోడ్ వికాస్ ల్యాప్‌టాప్ మంజూరు చేయాలని, మందమర్రికి చెందిన అమృత ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని, ఉట్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన ఆత్రం అయ్యుబాయి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని, జైనూర్ మండలం శివనూర్‌కు చెందిన ధనుష్ గురుకుల కళాశాలలో అడ్మిషన్ ఇప్పించాలని కోరారు. ఇంకా పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.