
భరోసా కల్పిస్తున్నాం
మాన్యువల్ కెమెరాల స్థానంలో డిజిటల్ కెమెరాల రాకతో చాలావరకు ప్రత్యేకత తగ్గింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్‌లు రావడంతో ఫొటోలు, సెల్ఫీలతో సెల్‌ఫోన్ ప్రింట్లు పెరిగాయి. ప్రొఫెషనల్ ఫొటో కెమెరాలతో కాకుండా సెల్ ఫొటోలపై మోజు పెంచుకుంటున్నారు. లక్షలు వెచ్చించి కొన్న కెమెరాలతో షూటింగులకు వెళ్లిన ప్రతీచోట సెల్‌ఫోన్‌లు ఇచ్చి ఫొటోలు తీయమంటున్న సందర్భాల్లో బాధగా ఉంటోంది. సంక్షేమ సంఘం ద్వారా కుటుంబ భరోసాతో అండగా నిలుస్తున్నాం.
– అప్పాసు రాము, ప్రొఫెషనల్ ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల