
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లిరూరల్: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బెల్లంపల్లికి చెందిన సీనియర్ కరాటే మా స్టర్ విజ్జగిరి రవి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బ హుమతి కై వసం చేసుకున్నారు. ఈ నెల 17న బెంగళూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి క రాటే బెల్ట్ టెస్ట్ పోటీల్లో పాల్గొని బ్లాక్ బెల్ట్ సిక్తస్ డాన్ కై వసం చేసుకున్నాడు. కెన్ భూ కాయ్ కరాటే ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ విజ యం, తెలంగాణ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు.
ముగిసిన రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 16 నుంచి జరుగుతున్న 5వ రాష్ట్ర బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషు ల విభాగంలో సంయుక్త విజేతలుగా హైదరా బాద్, రంగారెడ్డి జట్లు, తృతీయస్థానంలో నిజా మాబాద్ జట్టు నిలిచింది. మహిళల విభాగంలో హైదరాబాద్, నిజామాబాద్ జట్లు సంయు క్త విజేతలుగా తృతీయస్థానంలో నల్గొండ జ ట్టు నిలిచింది. విజేతలకు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్వేత ట్రోఫీలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్. కృష్ణ, జిల్లా అధ్యక్షుడు కళాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
బెదిరింపులకు పాల్పడిన ఒకరు అరెస్టు
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన షేక్ మహ్మద్ అలీని బెదిరించిన కేసులో పాండురంగ్ అనే వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. 2023లో మండల కేంద్రంలో సిరిచెల్మ చౌరస్తాలో జరిగిన మర్డర్ కేసులో మహ్మద్ అలీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని, కోర్టులో సాక్ష్యం చెప్తే చంపేస్తానని ఈ నెల 17న బెదిరించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ