
‘పోడు’ రైతులకు న్యాయం చేస్తాం
కౌటాల: ప్రజా ప్రభుత్వంలో పోడు రైతులకు న్యాయం చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పాడి పోడు రైతులు కేసుల పాలు కావొద్దన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఎంపీ ఎన్నికల ప్రచారంలో గోడం నగేశ్‌ను గెలిపిస్తే గిరిజనేతర రైతులకు పోడు పట్టాల పంపిణీ చట్టం చేస్తామని ఇచ్చిన హామి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పోడు వ్యవసాయం కేంద్రం పరిధిలో ఉందని, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు పోడు పట్టాల పంపిణీ చట్టంను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనేతరులకు ఐదెకరాలకంటే ఎక్కువ పోడు సాగు ఉదని అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, పార్టీ మండల కన్వీనర్లు నికోడే గంగారాం, ఉమా మహేశ్, నాయకులు సీతల్, విఠల్, పోశం, శంకర్, రవి, లహాను, తదితరులు పాల్గొన్నారు.