
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ఇంద్రవెల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి మండలంలోని ముత్నూర్ సమీపంలో గ ల త్రివేణి సంగమం చెరువు, కోతకు గురైన ప్రధాన రహదారిని పరిశీలించారు. అనంతరం పిట్టబొంగ రం గ్రామంలో ఈదురు గాలులతో ఇంటి పైకప్పు కొట్టుకుపోయిన అనక జంగు కుటుంబాన్ని పరామర్శించారు. దస్నాపూర్, వడగామ్, హీరాపూర్, అంజీ తదితర గ్రామాల్లో పర్యటించి కోతకు గురైన రో డ్లు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీ ల్దార్ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి జహీర్, నాయకులు ఎండీ మసుద్, మీర్జా యాకూబ్‌బేగ్, సోమోరే నాగోరావ్ పాల్గొన్నారు.