ఉద్యోగ, ఉపాధికి భరోసా...! | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ, ఉపాధికి భరోసా...!

Aug 18 2025 5:49 AM | Updated on Aug 18 2025 5:49 AM

ఉద్యోగ, ఉపాధికి భరోసా...!

ఉద్యోగ, ఉపాధికి భరోసా...!

ఐటీఐ, ఏటీసీలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 6 నుంచి కొనసాగుతున్న స్పాట్‌ అడ్మిషన్లు 28తో ముగియనున్న గడువు

మంచిర్యాలఅర్బన్‌: నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థ (ఐటీఐ)లను నవీకరించి అడ్వాన్స్‌డ్‌ టెక్నాల జీ కేంద్రాలు (ఏటీసీ)గా తీర్చిదిద్దింది. ఐటీఐలలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ ఏటీసీలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సిర్థపడేందు కు బాటలు వేస్తున్నారు. పదోతరగతి పాసైన విద్యార్థులకు అవసరమైన అత్యాధునిక శిక్షణ పొందే ఏటీసీలో స్పాట్‌ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 6 నుంచి స్పాట్‌ వాక్‌ఇన్‌ ఇంటర్‌ూయ్వ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసకుంటే ఆన్‌లైన్‌లో మెరిట్‌ జాబితా వెలువడిన త ర్వాత ఇంటర్‌ూయ్వ నిర్వహించి కోరుకున్న కోర్సులో ప్రవేశానికి అవకాశం ఇవ్వనున్నారు. స్పాట్‌ అడ్మిషన్లకు ఈ నెల 28తో గడువు ముగియనుంది.

పారిశ్రామిక శిక్షణ

విద్యార్థులకు శిక్షణనిచ్చి స్వయం ఉపాధి పొందేందుకు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు సాధించేందు కు ఐటీఐలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల ఐటీఐ లో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మెకానిక్‌, టర్నర్‌, కోపా, సోలార్‌ టెక్నీషియన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌తో పాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏటీసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషిన్‌ ఇండస్ట్రియల్‌ రోబోటెక్స్‌, డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, వర్చువల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ డిజైనర్‌, అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌, మెకానిక్‌ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

32 సీట్లు ఖాళీ

మంచిర్యాల ఐటీఐలో 97 శాతం, ఏటీసీలో 85 శా తం సీట్లు భర్తీ అయ్యాయి. ఇప్పటికే పలు దఫాలు గా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఐటీఐ, ఏటీసీల్లో మొత్తం 376 సీట్లుకుగానూ 344 భర్తీ కాగా 32 సీట్లు మిగిలి ఉన్నాయి. ఐటీఐలో 204 సీట్లుకుగానూ 197 భర్తీ కాగా ఏడు సీట్లు, ఏటీసీలో 172 సీట్లకుగానూ 147 భర్తీ కాగా 25 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఆధునిక పరికరాలతో కొత్త కోర్సులు...

పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏటీసీలను ఏర్పాటు చేశారు. కోర్సులకు సంబంఽధించిన ఏటీసీ భవనంలో ఆధునాతన పరికరాలు అమర్చారు. డెల్‌ వర్క్‌ స్టేషన్‌, ఐవోటీ కిట్‌, సర్వర్‌ రాక్‌, త్రీడీ ప్రింటర్‌, కార్‌ లిప్ట్‌, సిల్‌, ఫెయింట్‌ బాత్‌, ఇండస్ట్రియల్‌ రోబోటెక్‌, కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (సీఎన్‌సీ), వీఎంసీ, ప్లంబింగ్‌ పరికరాలు బిగించారు. టాటా టిగోర్‌, టాటా ఏసీ, ఈవీ కిట్‌, మహేంద్ర త్రీవీలర్‌ పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది నుంచి ఏటీసీ ప్రవేశాలకు అవకాశం కల్పించారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఐటీఐ, ఏటీసీలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. ప్రతీరోజు ఉదయం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ అనంతరం మెరిట్‌ లిస్టు ఆధారంగా వాక్‌ ఇన్‌–ఇంటర్వ్యూలుంటాయి. పదోతరగతి మెమో, బోనఫైడ్‌, కులధ్రువీకరణ, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టుసైజ్‌ ఫొటో, టీసీ సమర్పించాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– రమేశ్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement