
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
జన్నారం:చేపలు పట్టేందుకు వెళ్లి ప్ర మాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై గొల్లపెల్లి అ నూష కథనం ప్రకా రం.. జన్నారం మండలం కొత్తపేట గ్రామం కొలాంగూడకు చెందిన ఆత్రం భీము (30) ఆదివారం ఉదయం కొత్తపేట చెరువు అలుగు రావడంతో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో కాలుజారి నీటిలో మునిగాడు. ఈత రాకపోవడంతో మృతిచెందాడు. అటుగా వెళ్తున్నవారు గమనించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఎస్సై ఘ టనస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించారు. తండ్రి అర్జున్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.