
కరెంట్ షాక్‌తో మహిళ..
నెన్నెల: మండలంలోని కోణంపేట గ్రామానికి చెందిన దుర్గం తార (59) ఆదివారం సాయంత్రం కరెంట్ షాక్‌తో మృతి చెందింది. ఇంట్లో కూలర్ ఆఫ్ చేసే క్రమంలో విద్యుదాఘాతంతో కిందపడింది. పొరుగు వారు గమనించి కర్రతో కొట్టి పక్కకు తొలగించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వర్షానికి ఇల్లు ఉరిసి నేల తడిగా ఉండటం, కూలర్ బాడీ ఇనుపది కావడంతో కరెంట్ షాక్ వచ్చిందని భావిస్తున్నారు. భర్త బాపు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు.